Entho Vintha Entho Chintha Song Lyrics | ఎంతో వింత యెంతో చింత | TELUGU CHRISTIAN SONGS LYRICS

Entho Vintha Entho Chintha Lyrics | ఎంతో వింత యెంతో చింత యేసునాధు మరణ మంత | Telugu Christian Good Friday Songs...


emmanuelu raktamu song lyrics

Lyrics

ఎంతో వింత యెంతో చింత
యేసునాధు మరణ మంత (2)
పంతము తో జేసి రంత
సొంత ప్రజలు స్వామి నంత (2)      ||ఎంతో||


1. పట్టి కట్టి నెట్టి కొట్టి
తిట్టి రేసు నాధు నకటా (2)
అట్టి శ్రమల నొంది పలుక
డాయె యేసు స్వామి నాడు (2)       ||ఎంతో||


2. మొయ్యలేని మ్రాను నొకటి
మోపి రేసు వీపు పైని (2)
మొయ్యలేక మ్రాని తోడ
మూర్చబోయే నేసు తండ్రి (2)      ||ఎంతో||


3. కొయ్యపై నేసయ్యన్ బెట్టి
కాలు సేతులలో జీలల్ (2)
కఠిను లంత గూడి కొట్టిరి
ఘోరముగ క్రీస్తేసున్ బట్టి (2)      ||ఎంతో||


4. దాహము గొన చేదు చిరక
ద్రావ నిడిరి ద్రోహు లకటా (2)
ధాత్రి ప్రజల బాధ కోర్చి
ధన్యుడా దివి కేగె నహహా (2)      ||ఎంతో||


5. బల్లెముతో బ్రక్కన్ బొడవన్
పారే నీరు రక్త మహహా (2)
ఏరై పారే యేసు రక్త
మెల్ల ప్రజల కెలమి నొసగు (2)      ||ఎంతో||













Watch Entho Vintha Entho Chintho Song Vedio...

By usingYoutube video downloaderyou can download youtube videos.

Post a Comment

0 Comments